Saturday 25 May 2013

క్విజ్


"మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఎవరు?"

"సోనియా గాంధీ తండ్రి."

"ధోని భార్య పేరేమిటి?"

"సాక్షి."

"గుడ్. శ్రీరాముని భార్య పేరు?"

"నయనతార."

"2008లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచిలో ధోని ఎంత స్కోర్ చేశాడు?"

"ముప్పై మూడు బంతుల్లో నలభై నాలుగు పరుగులు. పాంటింగ్ రనౌట్ చేశాడు."

"సూపర్బ్. అంబేద్కర్ ఎవరు?"

"కలకత్తా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్."

"అమ్మ తోడు. అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్.. "

"జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. సినిమా పేరు ఆది."

"వెరీ గుడ్. 'కన్యాశుల్కం' రాసిందెవరు?"

"సిరివెన్నెల సీతారామశాస్త్రి."

"పోకిరి సినిమాలో మహేశ్ బాబు ఎందర్ని చంపాడు?"

"ముప్పై మందిని కాల్చి చంపాడు. పదిమందిని గాల్లోకి ఎగరేసి చంపాడు. ప్రకాశ్ రాజ్ ని మాత్రం పీక్కోసి చంపాడు."

"ఎక్సెలెంట్. పొట్టి శ్రీరాములు ఎవరు?"

"మా తాతయ్య ఫ్రెండ్."

"కిలో వంకాయలు పది రూపాయిలైతే రెండు కిలోలు ఎంత?"

"వంకాయలంటే బ్రింజాలేనా?"

"అవును."

"ఈ లెక్క మాకు చెప్పలేదు. పోర్షన్లో లేదు."

(picture courtesy : Google)