Sunday, 3 January 2016

'కూడలి' మూసివేత - ఒక మంచినిర్ణయం


తెలుగులో కొందరు బ్లాగులు రాస్తుంటారు, ఇంకొందరు చదువుతుంటారు. ఈ రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ 'కూడలి' అంటే అభిమానం. బ్లాగుల్ని ఒక పట్టీలా తయారుచేసి, ఎప్పటికప్పుడు అందించే సైట్‌ని ఎగ్రిగేటర్ అంటారు. ఈ ఎగ్రిగేటర్లలో కూడలి చాలా ప్రముఖమైనది. ఈమధ్య కూడలిని మూసేశారు. ఇది లేటుగా తీసుకున్న మంచి నిర్ణయం అని నా అభిప్రాయం. 

మీరీ ఎగ్రిగేటర్లని ఒక్కరోజు గమనించినా నానారకాల చెత్తకి కేరాఫ్ ఎడ్రెస్ తెలుగు బ్లాగులు అని అర్ధమైపోతుంది. వ్యక్తిగత వివాదాలు, దాడులు, ప్రతి దాడులు, తిట్లు (అప్పుడప్పుడు బండబూతులు) తెలుగు బ్లాగుల ప్రత్యేకత! మరప్పుడు ఈ చెత్తని సపోర్ట్ చెయ్యడానికి ఎగ్రిగేటర్లు ఎందుకు!?

ఇప్పుడు 'మాలిక' అని ఒక ఎగ్రిగేటర్ వుంది. ఈ సైట్ నిర్వాహకులు హిందుత్వవాదులు, వామపక్ష రాజకీయాల పట్ల తీవ్రమైన ఏవగింపు కలవారు. తమకి నచ్చని అభిప్రాయాలున్న సహబ్లాగర్లని తిట్టడానికే బ్లాగులు నడిపిన, నడిపిస్తున్న ఘనులు! ఇలా తిట్లూ, బూతులూ రాసినంత కాలం మాలిక తెగ ఎంజాయ్ చేస్తూ తనవంతు 'ప్రోత్సాహం' ఇస్తూనే వుంటుంది. బెస్టాఫ్ లక్ టు మాలిక!

(picture courtesy : కూడలి)

10 comments:

 1. క్షమించాలి. మీ అభిప్రాయంతో విభేదిస్తున్నందుకు. కూడలి మూత పడటంతో మనకి మీరన్న చెత్తకి కెరాఫ్ ఎడ్రస్ తెలుగు బ్లాగులు పూర్వం అద్భుతమైన బ్లాగుల వివరాలు అందటం కష్టం. కూడలి లో కూడ అవాకులు, చెవాకులు, ప్రేలాపనలు, వివాదాలు, వ్యక్తిగత దూషణలు తదితరాలు ఉండేవి. అవి ఎప్పుడూ ఉంటాయి కూడా.

  ఇకనుంచి కూడలికి పూర్వం / కూడలి తరువాత అనే తెలుగు బ్లాగుల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. అగ్రిగేటర్లన్న తరువాత మంచి చెడు వాటి మధ్యనున్నవాటిని అందించక తప్పుదు.

  మంచి చూసే వారి దృక్పధం లో ఉంటుంది. అప్పట్లో తలా ఒక చెయ్యి వేసి కూడలిని నడిపించారు. ఇప్పుడు కూడ తలా ఒక చెయ్యి వేస్తే అసభ్యము, అభ్యంతకరము కాని బ్లాగుల అగ్రిగేటర్ ని ప్రోత్సహించవచ్చు.

  ReplyDelete
  Replies
  1. మీరింకా బ్లాగుల్ని ఫాలో అవుతున్నారా!?

   (నాకైతే అక్కడంతా కాపీ పేస్ట్ వ్యవహారమే కనపడుతుంది.)

   Delete
 2. కొన్నింటిని ...ఫాలో అవుతున్నాను. ఎత్తిపోతల పధకాలు ఎప్పుడూ ఉంటాయి డాట్రు గారు! చి న

  ReplyDelete
 3. మీ అభిప్రాయం తో ఏకీభవించలేకపోతున్నాను. అగ్రిగేటర్ చేసే పని , బ్లాగ్ లని చేర్చుకోవడం అంతే , అందులో చెడ్డ, మంచి అని విభజించలేరు.
  వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళు చేస్తున్నారు అంతే కాని పని గట్టుకుని పలానా బ్లాగ్ లు మాత్రమె చేర్చుకోవాలి అనుకోలేదు . నేను రాసే పోస్ట్ మంచిదో చెడో చెప్పడం వాళ్లకి ఎలా సాధ్యం. ప్రతీ పోస్ట్ చదివి accept చేయలేరు. అగ్రిగేటర్ కూడా facebok లాన్తిదె. బోలెడంత చెత్త ఉంటుంది మీకు కావాల్సింది ఏరుకోవడమే .
  అసలు అగ్రిగేటర్ ఉండటమే తప్పు ఎలా అవుతుందో అర్ధం కావడం లేదు. మీరు ఫేస్బుక్ వాడుకుంటూ అగ్రిగేటర్లని మూసేయమని చెప్పడం భావ్యం కాదు
  :kasi

  ReplyDelete
  Replies
  1. బాబూ , మాలిక పాపం హంస లా బ్లాగుల్ని విభజించి వాళ్ళు చెత్త వ్రాయడానికి అనుమతించని బ్లాగుల్ని మాలిక నుండి పీకి పారేయ్యడమే కాకుండా, ఆ బ్లాగులగురించి అక్కడ చెత్త ప్రచారం చెయ్యడానికి నాలుగు బ్లాగులు పెట్టి సమూహం గా శ్రమదానం చేస్తుంటారు.

   హ్మ్ కూడలి మూసివేసారా. మంచి పనే కాని .. ఆర్నెల్లకోసారి బ్లాగులేవరయినా వ్రాస్తున్నారా అని చూడ్డానికి కూడలి ఉండదు ..కాని ఇలా ఒక్కొక్క సంకలిని పోవడం అంటే మొదట చివుక్కుమన్నా వాటి అస్తిత్వం అనవసరం అయినప్పుడే కదా అవి కనుమరుగవుతున్నది అని సరిపెట్టుకోవాలి.

   మీ చివరి రెండు పేరాలు అద్భుతంగా ఉన్నాయి రమణ గారు. భలే సంతోషం వేసింది మీరు క్లుప్తం గానే మీ అభిప్రాయం చెప్పినందుకు.

   చాన్నాళ్ళ తర్వాత , నా బ్లాగు కి వస్తున్నా చదువరుల లింక్ తో వెళ్త మాలిక చూడాల్సి వచ్చింది. మూడేళ్ళ తర్వాత, ఇంతమంది వ్రాయడం లేదు కదా ! కాని అక్కడ చెత్త,కుళ్ళు ఏమాత్రం తగ్గక పోవడం చూస్తె .. ఇంకోసారి అగ్రిగేటర్ చూసే పని లేదు అని అర్ధం అయ్యింది. అయినా వీళ్ళు మాలిక లో పీకేసిన బ్లాగుల్ని ఇంకా ఆసక్తి తో ఫాలో అవుతూ ఉంటారు. వాటి పై గూగుల్ లో జుట్టు పీక్కుంటూ ఉంటారు కూడా :)

   ఇక వరూధిని అయితే హైలెట్

   Delete
  2. "అందులో మంచి చెడ్డ అని విభజించలేరు"

   అలా అని మనచేత అనిపించడంలోనే వారి కపటత్వమంతా దాగుంది. ఫలానా బ్లాగరు ఎలా రాస్తాడు అన్న విషయం చిన్నపిల్లలక్కూడా తెలుసు. ఉదా|| దేశాన్ని రక్షించమనే వంకతో టెర్రరిజాన్నీ, మతోన్మాదాన్ని ప్రోత్సహించే ఒక బ్లాగుంది, మూఢనమ్మకాల వ్యాప్తికై కంకణం కట్టుకొని శ్రమిస్తున్న ఒక ఆశ్రమ నిర్వాహకులుగారి బ్లాగుంది. వీళ్ళిద్దరూ ఒకర్ని తిట్టకుండా ఎన్నడూ ఒక పోస్టురాసింది లేదు. ఇంకొకాయన తన మతాన్ని సపోర్టుచేసుకుంటూ పక్కవాళ్ళ మతాలని చిన్నబుచ్చడానికే రాస్తుంటాడు. వీళ్ల రాతలు చదివితేనే అవి విషపురాతలనీ, ఉన్మాదపు రాతలనీ వాళ్ళు deranged మనుషులని అర్ధమవుతుంది. గమ్మత్తైన విషయమేంటంటే మనకు ఇలాంటి వాళ్ళ విషయంలో వాక్స్వాతంత్రపుహక్కు భలేగా గుర్తొస్తుంది.

   ఈబ్లాగులని లిస్ట్ చేస్తున్న అగ్రిగేటర్ల అభిరుచులస్థాయి ఎవరికి అర్ధంకాలేదు చెప్పండి?

   Delete
 4. రమణ గారు, ఒకప్పుడు తెలుగు బ్లాగులు చాలా బావుండేవి. FB వచ్చాక అప్పటి బ్లాగర్లు రాయటం ఇంచుమించు మానేశారు.

  ReplyDelete
 5. Aggregator has no control over content.

  ReplyDelete
 6. మాలిక బ్లాగు మీద మీ అక్కసును చక్కగా వెళ్లగక్కారు. అది వెల్లడించటానికి ఇన్ని సంవసరాలు ఆగాలా? బ్లాగును నడిపినన్ని రోజులు మాలికపై నోరెత్తన్ని మీరు ఇప్పుడు విమర్సించటం? రాజకీయ నాయకుల ప్రవర్తనకి మీరే మాత్రం తీసి పోరు. మీరు మంచి నటులు. మీకు ఫేస్ బుకే సరి పోతుంది, అక్కడ విమర్శలకు తావులేదు, లైకులు తప్పించి డిస్ లైక్ కొట్టటానికి స్కోపే లేదు.

  ReplyDelete

Note: only a member of this blog may post a comment.