Monday 6 August 2012

నీచనికృష్ట చైనా! దీన్ని మెడబట్టి గెంటండి!


మనం రాజకీయాల్ని మాట్లాడుకోవద్దు. వాస్తవాలు మాట్లాడుకొందాం.

సర్వకాలములందు సత్యం సత్యంగానే వుంటుంది, అసత్యంగా మారదు. రక్తం ఎర్రగా ఉంటుంది. గిచ్చితే నొప్పిగా ఉంటుంది. ఆకలేస్తే నీరసంగా ఉంటుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇవన్నీ జీవిత సత్యాలు.

అలాగే - ఒక వ్యక్తి ఆకలి చావు ఈ మానవాళి సిగ్గుతో తల దించుకోవాల్సిన నేరం. అది ఇథియోపియాలో కావచ్చు, ఇండియాలో అయినా కావచ్చు. ఇందులో మినహాయింపులు ఉండవు, ఉండరాదు. కాబట్టి ఒక మనిషిగా, ఒక ప్రపంచ పౌరునిగా సిగ్గుతో తల దించుకుందాం.

అదేవిధంగా - పిల్లల్ని హింసించే వ్యవస్థ దుర్మార్గమైనది, నీచమైనది, నికృష్టమైనది అనే ఖచ్చితమైన అభిప్రాయం నాకుంది. ఇక్కడ ఎటువంటి వాదప్రతివాదనలకి తావు లేదు. మన దేశంలో చదువుల కోసం పిల్లల్ని హింసించడం చట్టవ్యతిరేకం. శిక్షార్హమైన నేరం. అదే విషయాన్ని మనమందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాం కూడా.

ఆహారానికి అవసరమైన పశువధ కూడా 'డీసెంట్'గా జరగాలని కోరుకుంటాం. కానీ - చైనాలో ఏం జరుగుతుంది? చట్టబద్దమైన హింసోన్మాదం. అందునా పసిమొగ్గలు. ఇదేమి రాజ్యం! ఒలింపిక్ మెడల్స్ కోసం పిల్లల్ని పశువుల కన్నా హీనంగా హింసిస్తున్నారు. వీళ్ళేమీ కేజెస్ లో పక్షులు కారుగా!

అమ్మా సైనా! అయ్యా గగనూ! ఒక దరిద్రపుగొట్టు వెధవ మెడల్స్ కోసం పసికూనల అందమైన బాల్యాన్ని చిదిమేస్తున్నాడు. వాడికి తమ దేశపౌరుల సంక్షేమం కన్నా అంతర్జాతీయ గుర్తింపు ముఖ్యమట! మీదగ్గరున్న మెడల్స్ ఆ దౌర్భాగ్యుడి బిక్షాపాత్రలో ముష్టిగా వెయ్యమని నా సలహా! అప్పుడైనా బుద్ధొస్తుందేమో దొంగ గాడిద కొడుక్కి!

ఒరే బూచోడా! నీక్కావలంటే మా ఇళ్ళల్లో ఆడవాళ్ళ బంగారు ఆభరణాలు నీమొహాన కొడతాం లేరా! దాంతో ఇంకో వంద బంగారు పతకాలు చేయించుకుని మెళ్ళో వేసుకుని ఊరేగి చావు! కానీ - ఆ పసికూనల్ని నీ కబంధ హస్తాల నుండి వదిలెయ్యరా దౌర్భాగ్యుడా!

చివరగా - ఈ ఒలింపిక్ ఆటల్లో మెడల్స్ కోసం మానవ హక్కుల్ని హరిస్తున్న  చైనాని చెప్పుతో కొట్టి, మెడబట్టి ఒలింపిక్స్ నుండి బయటకి తన్నాలని అన్నిదేశాల ప్రభుత్వాలకి, క్రీడా సంఘాలకి విజ్ఞప్తి చేస్తున్నాను

(photo courtesy : Google)