"నాకు ఏడుపొస్తుంది."
"ఎందుకు?"
"ఇక హైదరాబాదు మనది కాదు."
"మనకి మన చంద్రబాబున్నాడు. ఇట్లాంటి హైదరాబాదులు పది నిర్మిస్తాడు."
"మెట్రో మనకి కాకుండా పోతుంది."
"పొతే పోనీ, మనకి మన జగన్బాబున్నాడు. ఇట్లాంటి మెట్రోలు పది కట్టిస్తాడు."
"నిమ్స్ కూడా మనకుండదు."
"మనకి మన కిరణ్బాబున్నాడు. ఇట్లాంటి నిమ్సులు పది తెప్పిస్తాడు."
"శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లిపోతుంది."
"వెళ్తే వెళ్ళనీ, మనకి మన కావూరి ఉన్నాడు. ఇట్లాంటి శంషాబాదు విమానాశ్రయాల్ని పది కట్టిస్తాడు."
"మనకిక ఔటర్ రింగు రోడ్డు ఉండదు."
"మరేం పర్లేదు, మనకి మన టీజీ వెంకటేశ్ ఉన్నాడు. ఇట్లాంటి ఔటర్ రింగు రోడ్డులు పది నిర్మిస్తాడు."
"హైటెక్ సిటీ ఇంక మనది కాదు."
"మనకి మన లగడపాటి ఉన్నాడు. ఇట్లాంటి హైటెక్కు సిటీలు పది సృష్టిస్తాడు."
"అవును కదా! గొప్ప లీడర్లంతా మనవైపే ఉన్నారన్న సంగతి మరిచిపొయ్యాను."
"తెలంగాణా వాళ్లకి బోడి హైదరాబాదే వెళ్ళింది. గొప్పగొప్ప లీడర్లంతా మనవైపుకే వచ్చేశారు."
"అయ్యయ్యో! అనవసరంగా ఏడిచానే."
(photo courtesy : Google)
