Friday, 22 June 2012

అభిమానం.. ఆవేదనతో.."కాకా! ఏమిటిలా అయిపొయ్యావ్! ఏమైంది నీకు?"

'అచ్చా తొ హమ్ చల్తీ హై! ' అంటూ 'కిషోర్ దా' దగ్గరకి వెళ్దామని తొందరపడకు.

'చలా జాతా హూ! ' అని పాడుతూ పంచమ్ ని చేరుకుందామనుకొని ఆశ పడకు.

'నన్ను వదలి నీవు పొలేవులే.. అదీ నిజములే!'

అందుకే..

నా దగ్గర నీ పప్పులేం ఉడకవ్ ఆనంద్!

ఇప్పుడే 'బాబూ మొషాయ్' ని పంపిస్తున్నాను.

నిన్నెలా హేండిల్ చెయ్యాలో బాబు మొషాయ్ కి బాగా తెలుసు.

అప్పుడు మనం..

'యే షామ్ మస్తానీ.. ' అంటూ పాడుకుందాం.

'మేరె సప్నోన్ కి రాణి.. ' అంటూ జీప్ లో చక్కర్లు కొడదాం.

'జైజై శివశంకర్.. ' అంటూ భంగ్ తాగి గంతులేద్దాం.

మిత్రమా! రాజేష్ ఖన్నా!

గమ్మత్తులు చేసి మమ్మల్ని మత్తులో ముంచేశావ్!

వెర్రివాళ్ళని చేసేశావ్!

అందుకే అడుగుతున్నాను.. బరువెక్కిన గుండెతో..

"కాకా! ఏమిటిలా అయిపొయ్యావ్! ఏమైంది నీకు?"

వుయ్ లవ్ యు! గెట్ వెల్ సూన్ మ్యాన్!


(photos courtesy : Google)